సదైవ్ అటల్ దగ్గర నివాళులర్పించిన చంద్రబాబు..! 11 d ago
ఢిల్లీ: సదైవ్ అటల్ దగ్గర సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. భారతజాతి గర్వించదగిన నేత భారతరత్న వాజ్‌పేయి అని అన్నారు. వాజ్‌పేయి దూరదృష్టి కారణంగానే దేశ గతి మారిందన్నారు. ప్రపంచదేశాలతో మన దేశం పోటీ పడుతోందని తెలిపారు. వాజ్‌పేయితో పనిచేసిన అనుభూతి గుర్తుండిపోతుందన్నారు. దేశం గురించి వాజ్‌పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదన్నారు. నేషన్ ఫస్ట్ అని ఎప్పుడూ భావించేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.